6, ఫిబ్రవరి 2012, సోమవారం

భానుమతి, ఎ.ఎం.రాజా పాడిన అలనాటి మధురగీతం "ప్రియతమా మనసు మారునా" - ఆలీబాబా 40 దొంగలు నుండి

అరేబియన్ నైట్స్ కథలలో చాల ప్రసిద్ధి చెందినది ఆలీబా కథ. ఇది ఆలీబాబా-మార్జియానాల ప్రేమ కథ.  ఈ కథను "ఆలీబాబా 40 దొంగలు" పేరుతో తెలుగులో రెండు, మూడు సార్లు తీసారు. అందులో ఒకటి (1956) తమిళం నుండి తెలుగులోకి డబ్బింగ్ చేసినది. అదే కథను డైరెక్టు చిత్రంగా ఎం.టి.ఆర్. జయలలిత లతో 1970 లో తీసారు. అయితే చెప్పుకోవలసిన విషయమేమిటంటే, ఈ రెండు చిత్రాలలో నటించిన ఇద్దరు పాత్రధారులు, మొదటి దానిలో హీరో (ఎం.జి.ఆర్.), రెండవ చిత్రంలో హీరోయిన్ (జయలలిత) తమిళనాడుకు ముఖ్యమంత్రులైనారు. అలాగే తెలుగు డైరెక్టు చిత్రంలో నటించిన ఎన్.టి.ఆర్. కూడా ముఖ్యమంత్రి అయ్యారు. తమిళంలో ఎం.జి.రామచంద్రన్ ఆలీబాబాగా, భానుమతి మార్జియానాగా నటించారు. అరేబియన్ సంస్కృతికి అనుగుణమైన చక్కని వాద్య సంగీతాన్ని స్వర బ్రహ్మ శ్రీ సుసర్ల దక్షిణామూర్తి (నర్తనశాల fame) గారు అందించారు. ఈ పాటకు మాతృక "ఆలీబా ఔర్ చాలీస్ చోర్ హిందీ చిత్రానికి సంగీత దర్శకులు శ్రీ చిత్రగుప్త & ఎస్.ఎన్.త్రిపాఠి కూర్చిన బాణీ "ఏ సుబహ ఉన్ సే కెహ్ జరా" (మ్యుజికాలిస్ట్ రాజా గారికి కృతజ్ఞతలతో).  ఈ డబ్బింగ్ చిత్రంలో "ప్రియతమా మనసు మారునా" అనేది అలనాటి సూపర్ డూపర్ హిట్. ఆ పాటను, సాహిత్యాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను. 

ఎ.ఎం.రాజా      పి. భానుమతి
 రచన:         తోలేటి వెంకటరెడ్డి
  



A.M.రాజా:    ప్రియతమా మనసు మారునా ప్రేమతో సిరులు నిలచి మీరునా  | ప్రియతమా |
భానుమతి:   తేనెలూరే బాసలన్నీ తీరుగా నీటిపైన వ్రాతలే కదా                | తేనెలూరే |
A.M.రాజా:    ఖుదాపై బాస చేతునే, హృదయమే నీది మధుర భాషిణీ


A.M.రాజా:    నా మనోహరీ! వినుము నీ గులామునే
భానుమతి:   ఓ మనోహరా! కొనుము నా సలాములే
A.M.రాజా:    నా మనోహరీ! వినుము నీ గులామునే
భానుమతి:   ఓ మనోహరా! కొనుము నా సలాములే
                తేనెలూరే బాసలన్నీ తీరుగా నీటిపైన వ్రాతలే కదా
                ప్రియతమా మనసు మారునా ప్రేమతో సిరులు నిలచి మీరునా
A.M.రాజా:    ఖుదాపై బాస చేతునే, హృదయమే నీది మధుర భాషిణీ


A.M.రాజా:    జవ్వనీ! నీవులేని జన్మమే వృధా
భానుమతి:   సుందరా! నీవులేని అందమే వృధా
A.M.రాజా:    జవ్వనీ! నీవులేని జన్మమే వృధా
భానుమతి:   సుందరా! నీవులేని అందమే వృధా
ఇద్దరు:        వలపుమీరా తనివితీరా హాయిగా ప్రణయసీమ సాగిపోదమా     | వలపుమీరా |
                ప్రియతమా మనసు మారునా ప్రేమతో సిరులు నిలచి మీరునా  | ప్రియతమా |
                ప్రియతమా..

4 కామెంట్‌లు:

  1. సూరి గారు, "మంచి పాట" బ్లాగ్ లో ఒక మంచి పాట వేసారు. ఈ పాటంటే నాకు ఎంతో ఇష్టం. నేను తరచూ వింటూ ఉంటాను.
    నేను ఈత్రాన్ని 1956 లో మదరాస్ లో చిత్ర అనే టాకీస్ లో చూసాను. ఈ పాట తమిళ్ లో, తెలుగులో చాలా ప్రసిద్ది పొందిన పాట .
    తమిళ్ లో మొదటి చరణం: " మాసిలా ఉన్మై కాదలి, మారుమో సెల్వం అంద్రు పోదిలే" ( లిరిక్స్ నాకు గుర్తు లేదు).
    మొన్న ఈ మధ్యనే ఆ సినిమా చూసాను కూడా. ముఖ్యంగా ఈ పాట గురించి నలుగురికి చెప్పి నందులకు ధన్యవాదాలు.
    ఈ సినిమా లో నటించిన హీరో రామారావు గారు కూడా ఆంధ్ర ప్రదేశ్,ముఖ్య మంత్రి అవడం యాదృచ్చికం.

    రిప్లయితొలగించండి
  2. వెంకోబా రావు గారు, చాల చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు. నిజమే రామారావుగారు కూడ ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ కి.

    రిప్లయితొలగించండి
  3. no offense, I like A.M.Raja, but not song from Bhanumathi. (she holds her nose and sings, and little dominating character. I guess.), May be the reason P.Suseela and Latha Mangeshwer spoiled us. It was a good verbatim. Any way thanks.
    It was so nice to see you this week-end.
    kishen c.rao
    venky-villa, winterville, nc.

    రిప్లయితొలగించండి

Blog Indices